శక్తి టీమ్ అవగాహన కార్యక్రమం
TPT: నారాయణవనం పోలీస్ స్టేషన్ పరిధిలో శక్తి టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలకు చైన్ స్నాచింగ్, సైబర్ నేరాలు, మహిళల భద్రతపై సూచనలు ఇచ్చారు. శక్తి యాప్ వినియోగం, లోన్ యాప్ మోసాలు, ఆన్‌లైన్ ఫ్రాడ్స్‌పై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.