డైరీ యూనిట్‌తో మహిళ ఆర్థికాభివృద్ధి: కలెక్టర్

డైరీ యూనిట్‌తో మహిళ ఆర్థికాభివృద్ధి: కలెక్టర్

సత్యసాయి: గుడిబండ మండలం కరికెర గ్రామంలో లక్ష్మమ్మ నిర్వహిస్తున్న డైరీ యూనిట్‌ను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మంగళవారం సందర్శించారు. డైరీ ద్వారా రోజుకు 30 లీటర్ల పాలు విక్రయిస్తూ... నెలకు రూ. 50 వేల ఆదాయం పొందుతున్నట్లు లక్ష్మమ్మ వివరించారు. మహిళలు స్వయం ఉపాధి రంగాల్లో రాణించడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు.