హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్

హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్

KKD: కారు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తన భార్య లక్ష్మీదుర్గ ప్రమేయం లేదని, ఆమెను కేసు నుంచి తప్పించాలని అనంతబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను రాజమహేంద్రవరంలోని ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. దీంతో కేసులో అనంతబాబు ఏ1గా, ఆయన భార్య లక్ష్మీదుర్గ ఏ2గా కొనసాగుతారు.