నందివెలుగులో స్పెషల్ ఆఫీసర్ పర్యటన

నందివెలుగులో స్పెషల్ ఆఫీసర్ పర్యటన

GNTR: తెనాలి మండలం నందివెలుగులో MRO గోపాలకృష్ణ మంగళవారం ఉదయం ఆకస్మిక పర్యటన చేశారు. గ్రామానికి స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్న ఆయన ఉదయాన్నే పంచాయతీ అధికారులు, సిబ్బందితో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారిపై ఇరువైపులా ఆక్రమణలను గుర్తించి సిబ్బందిని ప్రశ్నించారు. రెండు రోజుల వ్యవధిలో మొత్తం తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు.