జిల్లా ఆర్చరీ సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

NZB: జిల్లా ఆర్చరీ సంఘం ఎన్నికలు ఇవాళ నిర్వహించారు. వివిధ పోస్టులకు ఒక్కొక్కరే పోటీ చేయటంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎలక్షన్ అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. సంఘ అధ్యక్షుడిగా ఈగ సంజీవరెడ్డి, కార్యదర్శిగా గంగరాజు, కోశాధికారిగా బాల గంగాధర్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు రాష్ట్ర పరిశీలకులుగా తెలంగాణ ఆర్చర్ కార్యదర్శి అరవింద్, లింగయ్య, ప్రశాంత్ పాల్గొన్నారు.