పసివాడిని లాలించిన మంత్రి స్వామి

ప్రకాశం: మర్రిపూడి మండలం నరసరాజుపాలెంలో ఓ ఆసక్తికరమైన ఘటన శనివారం చోటుచేసుకుంది. గ్రామంలో ఓ శుభకార్యానికి మంత్రి స్వామి హాజరయ్యారు. కార్యకర్తలతో మాట్లాడుతున్న సమయంలో మంత్రి పక్కన ఓ పసివాడి ఏడుపు వినిపించింది. అది గమనించిన మంత్రి ఆ పసివాడిని ఎత్తుకుని లాలించాడు. ఈ సన్నివేశం అక్కడ ఉన్న వారందరినీ ఆకట్టుకుంది.