VIDEO: సోషల్ మీడియాతో డ్రైనేజీ సమస్య పరిష్కారం
GDWL: గద్వాల్ పట్టణం 12వ వార్డులో డ్రైనేజీ సమస్యలపై కౌన్సిలర్ లతా రామకృష్ణ సోషల్ మీడియాను ఆశ్రయించారు. అధికారులకు పలుమార్లు చెప్పినా స్పందన లేకపోవడంతో వార్డు పరిస్థితిని ఫొటోలు తీసి నెట్టింట వైరల్ చేశారు. దీంతో మున్సిపల్ కమిషనర్ స్పందించి ఆదివారం JCB పంపించి చెత్తను తొలగింపజేశారు. పారిశుద్ధ్య పనులు క్రమం తప్పకుండా చేపట్టాలని ఆమె కోరారు.