ఇరాన్‌కు శాశ్వత నష్టం కలిగిస్తాం: ట్రంప్
ఇరాన్‌పై అమెరికా దాడులు ఇంకా ముగియలేదని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. భవిష్యత్తులో ఇరాన్ నుంచి యూఎస్ అధ్యక్షులు ఎవరూ ముప్పు ఎదుర్కోకుండా చేస్తామని తెలిపారు. ఇరాన్‌కు శాశ్వత నష్టం కలిగిస్తామన్నారు. ఇప్పటికిప్పుడు యుద్ధం ఆపేసినా.. నష్టాన్ని పూడ్చుకోవాలంటే ఇరాన్‌కు 10 ఏళ్లు పడుతుందన్నారు. కానీ ఆ నష్టాలు శాశ్వతంగా ఉండేలా దెబ్బతీయాలనుకుంటున్నట్లు వెల్లడించారు.