ఉగ్రవాదులకు శిక్ష ఎలా ఉండాలంటే..: రాహుల్ గాంధీ

పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కుటుంబాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరామర్శించారు. అనంతరం ‘‘కేంద్రానికి ప్రతిపక్షం తరఫున పూర్తి మద్దతు ఉంది. భారత్ వైపు ఎవరూ కన్నెత్తని విధంగా దోషులను శిక్షించాలి’’ అని రాహుల్ ట్వీట్ చేశారు.