సర్కార్ బడిలో తహసీల్దార్ కొడుకు
JN: పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో పాలకుర్తి తహసీల్దార్ సరస్వతి మంగళవారం తన కుమారుడిని 4వ తరగతిలో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మౌలిక వసతులు, ఉత్తమ ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ చేతులమీదుగా ప్రశంసలు పొందిన ఈ పాఠశాల ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చెందినదని తెలిపారు.