ఏఐసీసీ నేతను కలిసిన తుమ్మల

ఏఐసీసీ నేతను కలిసిన తుమ్మల

KMM: జాతీయ కాంగ్రెస్(AICC)సీనియర్ నాయకులు మాణిక్‌రావు ఠాక్రే శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఠాక్రేను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా యువ నాయకులు తుమ్మల యుగంధర్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆయనకు వివరించారు.