'క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవద్దు'

ADB: క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆదిలాబాద్ డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 10 ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని కరపత్రాలను ఆవిష్కరించారు. ఆత్మహత్యలకు పాల్పడటం వల్ల వారి కుటుంబాలు చిన్న భిన్నమవుతాయన్నారు.