నేడు ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన

నేడు ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన

SDPT: ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరించింది. క్యూములోనింబస్ మేఘాల వల్ల వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50KM వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, మెదక్‌లో మోస్తరుగా వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.