కొండిభలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు.
ASR: స్వస్త్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్ ప్రోగ్రాం మహిళల పాలిట ఆరోగ్య సంజీవిని అని డాక్టర్ బేబీ జాహ్నవి తెలియజేశారు. అనంతగిరి మండలంలోని కొండిబ గ్రామంలో అనంతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు బేబీ జాహ్నవి ఆధ్వర్యంలో ‘స్వస్త్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా బుధవారం మహిళలు 88 మందికి బి.పి, షుగర్ పరీక్షలు చేసారు.