ఫ్లై ఓవర్ నిర్మాణానికి సహకరించాలి: ఆర్డీఓ

ఫ్లై ఓవర్ నిర్మాణానికి సహకరించాలి:  ఆర్డీఓ

కాకినాడ: సామర్లకోట పట్టణంలో నూతనంగా నిర్మించనున్న రైల్వే ఫ్లై ఓవర్ భూసేకరణపై పెద్దాపురం ఆర్డీవో శ్రీధర్ గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు అవసరమైన భూముల సేకరణపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఫ్లై ఓవర్ నిర్మాణానికి రైతులు, స్థానికులు సహకరించాలని ఆర్డీవో కోరారు. ఈ సభలో తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, రైతు నేతలు, రైతులు పాల్గొన్నారు.