యాదాద్రి ఆలయానికి విలువైన ఇళ్లు విరాళం ఇచ్చిన భక్తుడు

BHNG: హైదరాబాద్ తిలక్‌నగర్‌లోని రూ.4 కోట్ల విలువైన జీ+3 ఇంటిని ముత్తినేని వెంకటేశ్వర్లు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి విరాళంగా ఇచ్చారు. ఈవో వెంకట్రావు సమక్షంలో దేవుడి పేరుగా రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లును సన్మానించిన అధికారులు, దాతకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రిన్స్‌పల్ సెక్రటరీ శైలజా రామాయ్య అభినందనలు తెలిపారు.