నేడే ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం
ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవాన్ని ఏటా మార్చి 23న నిర్వహిస్తారు. 1950లో ఈరోజునే ప్రపంచ వాతావరణ సంస్థ(WMO) ఏర్పడింది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, భూతాపం, ప్రకృతి వైపరీత్యాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ రోజు ప్రధాన ఉద్దేశ్యం. శాస్త్రవేత్తల ముందస్తు హెచ్చరికలు ఎన్నో ప్రాణాలను కాపాడుతాయి. పర్యావరణాన్ని కాపాడుకుంటూ సురక్షితమైన భవిష్యత్తును నిర్మించుకోవడం మనందరి బాధ్యత.