'తిరుమల లడ్డుపై చంద్రబాబు వికృత రాజకీయాలు'
Vsp: తిరుమల లడ్డూ కల్తీ పేరుతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా కూటమి నాయకులు భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు విమర్శించారు. పాలనలో విఫలమై, ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. లడ్డూ వ్యవహారంతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటని అన్నారు.