'విద్యా ప్రార్థన' కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్
కోనసీమ: పదో తరగతి విద్యార్థులు ప్రేరణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు అమలాపురంలో పదో తరగతి విద్యార్థులకు శుక్రవారం విద్యా ప్రార్ధన కార్యక్రమాన్ని ఆయన కలెక్టరేట్‌లో ప్రారంభించారు. జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థి విద్యపై ఏకాగ్రత పెట్టాలన్నారు.