రహానేకు సెహ్వాగ్ కౌంటర్
KKR కెప్టెన్ రహానే చేసిన వ్యాఖ్యలపై సెహ్వాగ్ అసహనం వ్యక్తం చేశాడు. ఓ ఇంటర్వ్యూలో రహానే.. తనపై అసూయతోనే కొందరు విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించాడు. దీనిపై సెహ్వాగ్ స్పందిస్తూ.. విమర్శలకు నోటితో కాదు, బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలన్నాడు. గతంలో సచిన్‌ను కూడా 'ఎండూల్కర్' అంటూ కెరీర్ ముగిసిందని విమర్శించారని, కానీ సచిన్ తన ఆటతోనే అందరి నోళ్లు మూయించాడని గుర్తుచేశాడు.