జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా 3 రోజులపాటు తూ.గో జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్పా ఎలాంటి ప్రయాణాలు చేయకూడదని తెలిపారు.