VIDEO: సూరేపల్లిలో మోస్తరు వర్షం

ప్రకాశం: కంభం మండలంలోని సూరేపల్లిలో ఆదివారం మధ్యాహ్నం వర్షం దంచి కొట్టింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాతావరణం చల్లబడి వర్షం కురుస్తుండడంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉరుములు, మెరుపులు లేకపోవడంతో విద్యుత్ సరఫరా అంతరాయం కలగలేదని గ్రామ ప్రజలు తెలిపారు. అలానే మండలంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.