ట్రాక్టర్, బైక్ ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
KMR: బీర్కూర్ మండలంలో ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిమ్మాపూర్ శివారులో ట్రాక్టర్, బైక్ ఢీకొని ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకులను మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ నుంచి నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.