అన్యాయాన్ని ప్రశ్నించే వాడే నిజమైన కమ్యూనిస్టు: ఎమ్మెల్యే
BDK: పాల్వంచలో నేడు జరిగిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య జీవిత చరిత్ర 'ప్రజల మనిషి' సినిమా ప్రారంభోత్సవంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. అన్యాయాన్ని ప్రశ్నించేవాడే నిజమైన కమ్యూనిస్టు అని, కేవలం పార్టీలో సభ్యత్వం ఉంటే కాదని వారు అన్నారు. కమ్యూనిస్టుల పని అయిపోయిందని విమర్శించేవారు గుమ్మడి నరసయ్యను చూసి నేర్చుకోవాలన్నారు.