సీనియర్ సిటిజన్ భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
MBNR: జడ్చర్ల మున్సిపాలిటీలోని 24వ వార్డులో నూతనంగా నిర్మించనున్న సీనియర్ సిటిజన్ భవనానికి ఆదివారం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సమాజానికి సేవలందించిన వృద్ధులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.