జీతాలు రాక... నిమ్స్ ఉద్యోగులు విలవిల

జీతాలు రాక... నిమ్స్ ఉద్యోగులు విలవిల

HYD: రెండు, మూడు నెలలుగా నిమ్స్ ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీతాలు చెల్లించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడంతో కొన్ని రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఓపీడీఎస్ కేటగిరీ ఉద్యోగులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించాలని సెక్యూరిటీ ఉద్యోగులు కోరుతున్నారు.