'మొబైల్ ఫోన్లతో ప్రభుత్వ పథకాల అమలు వేగవంతం'
కోనసీమ: గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలును మరింత పారదర్శకంగా, వేగంగా అందించడానికి స్మార్ట్ ఫోన్లు ఉపయోగపడతాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. కొత్తపేటలోని విజనరీ యాక్షన్ ప్లాన్ కార్యాలయంలో మంగళవారం ఆత్రేయపురం మండలం వీవోఏలుగా విధులు నిర్వహిస్తున్న 34 మందికి స్మార్ట్ ఫోన్లను ఎమ్మెల్యే అందజేశారు.