మానసిక వికలాంగురాలిపై అత్యాచారం

TPT: తిరుపతి రూరల్ మండలంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పుదిపట్ల పంచాయతీకి చెందిన ఓ మానసిక వికలాంగురాలైన మైనర్ బాలిక(17)పై ఓ లారీ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లితండ్రులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని ఫోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.