యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి: ఏఐఎస్ఎఫ్

VZM: రాష్ట్రంలో ఉన్న యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.యుగంధర్, జిల్లా కార్యదర్శి కోట అప్పన్న డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరుతూ బొబ్బిలిలో గోడపత్రికలు విడుదల చేశారు. కూటమి అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి రూ.3వేలు చెల్లిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చి ఏడాది అయినా అమలు చేయడం లేదన్నారు.