గంజాయి అమ్ముతూ దొరికిన అమెజాన్ డెలివరీ బాయ్
MDCL: యమ్నంపేటలో పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. పోలీసుల ప్రకారం.. యమ్నంపేటకు చెందిన మొగులపల్లి శివసాయి రెడ్డి (27) కారులో డ్రై గంజాయిని విక్రయిస్తున్నాడన్న సమాచారం అందడంతో రాక్ ఉడ్ ఇంటర్‌నేషనల్ స్కూల్ వద్ద తనిఖీ చేయగా కారులో 30 ప్యాకెట్ల డ్రై గంజాయి బయటపడింది. విచారణలో నిందితుడు అమెజాన్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడని తేలింది.