'అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారమివ్వాలి'

KDP: మైదుకూరు ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే సమీప పోలీసులకు కానీ, 112 నంబర్కు సమాచారం తెలపాలని మైదుకూరు సీఐ రమణారెడ్డి గురువారం తెలిపారు. ఇటీవల కాలంగా గొలుసు దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయని మహిళలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ద్విచక్ర వాహనదారులు కూడా వాహనానికి పక్క తాళం వేసుకోవాలన్నారు. మహిళలు విలువైన ఆభరణాలు ధరించి ప్రయాణాలు చేయవద్దన్నారు.