VIDEO: గరుడ వారధిపై ట్రాఫిక్ ఆంక్షలు
తిరుపతి గరుడ వారధిపై జిల్లా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వరుస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫ్లైఓవర్ పైకి ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాల రాకపోకలకు నిషేధం విధించారు. అయితే, ప్రమాదాల సాకుతో అనుమతి నిరాకారణపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.