పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి: ఎస్పీ

సత్యసాయి: వినాయక చవితి పండుగ సందర్భంగా నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ రత్న పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని కె.వి.ఆర్ ఫంక్షన్ హాల్ నందు అన్ని ఉత్సవ కమిటీ సభ్యులతో శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు.