'ప్రజలకు సేవ చేయడం అభినందనీయం'
BDK: సిరుల తల్లి సింగరేణి ఒడిలో 29 సంవత్సరాల పాటు విధులు నిర్వహించిన కొత్తగూడెం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ రుక్మాంగధర్ బండారి ఈరోజు పదవీ విరమణ పొందారు. కొత్తగూడెం కార్పొరేట్ మెయిన్ వర్క్ షాపులో సహ ఉద్యోగులు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి హాజరై రుక్మాంగదర్ బండారిను సన్మానించారు.