VIDEO: కొనుగోలు కేంద్రాలకు చేరుకున్న వరి ధాన్యం
JGL: పెగడపల్లి మండలంలో గత2 రోజులుగా వరి కోతలు ముమ్మరం కావడంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం చేరుకుంటుంది. మండలంలో 3 సహకార సంఘాలు, ఐకేపీ ఆధ్వర్యంలో అధికారులు 30 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వరి పొలాలు కోస్తున్న రైతులు ట్రాక్టర్ల ద్వారా కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలిస్తున్నారు. ప్రభుత్వం త్వరగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు.