ప్రేమ పేరుతో మోసం.. యువకుడి అరెస్టు

ప్రేమ పేరుతో మోసం.. యువకుడి అరెస్టు

KDP: జిల్లాలో ప్రేమ పేరుతో యువతిని మోసగించిన యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెన్నూరు సీఐ కృష్ణా రెడ్డి తెలిపారు. చెన్నూరులోని వనం వీధికి చెందిన శివశంకర్ ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, పది రోజుల కిందట ఆమె వద్ద బంగారం, నగదు తీసుకుని ఉడాయించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడిని సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు.