దివ్యాంగుడికి ఎలక్ట్రికల్ బ్యాటరీ ఆటో అందజేసిన: కలెక్టర్

ప్రకాశం: ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఎర్రగొండపాలెం మండలానికి చెందిన దివ్యాంగుడైన వెన్నా వెంకట్ రెడ్డికి జీవనాధారం కోసం ఎలక్ట్రిక్ బ్యాటరీ ఆటో ఇవ్వవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను అనుసరించి కలెక్టర్ తమీమ్ అన్సారియా, గనులు, దివ్యాంగుల శాఖ సమన్వయంతో ఆటోను కొనుగోలు చేసి లబ్ధిదారుడికి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం అందజేశారు.