చింతపల్లిలో పర్యటించిన జిల్లా వ్యవసాయ అధికారి
ASR: వ్యవసాయ అధికారులు, సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్బీఎస్ నందో సూచించారు. గురువారం ఆయన పాడేరు ఏడీఏ ప్రభాకర్‌తో కలిసి చింతపల్లిలో పర్యటించారు. స్థానిక ఏడీఏ తిరుమలరావు, ఏవో మధుసూధనరావుతో కలిసి చిన్నగెడ్డలో పర్యటించారు. రబీ సీజన్లో వేరుశనగ, మినుములు తదితర పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు.