స్కూటీపై చెట్టు కూలి మహిళ మృతి

విశాఖపట్నం సీతమ్మ ధారలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న మహిళపై చెట్టు కూలిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెండింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మృతురాలు వివరాలు ఇంకా తెలియలేదు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ తరలించారు.