టీపీసీసీ పరిశీలకుల నియామకం!

NLG: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జిల్లాకు పరిశీలకులను నియమించింది. ఇందులో భాగంగా NLG జిల్లాకు మక్తల్ ఎమ్మెల్యే వి.శ్రీహరి ముదిరాజ్, నజీర్ అహ్మద్‌ను పరిశీలకులుగా నియమించింది. వీరు జిల్లాలో ప్రస్తుతం ఉన్న డీసీసీ అధ్యక్షులను కొనసాగించాలా..? లేక కొత్తవారిని నియమించాలా..? అనే దానిపై పార్టీ శ్రేణుల అభిప్రాయాలు సేకరించి అధిష్టానానికి నివేదిక సమర్పించనున్నారు.