ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

NLG: గ్రామ పంచాయతీ ఎన్నికల చివరి విడత నిర్వహణను పగడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి రిటర్నింగ్ అధికారులకు సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. దేవరకొండ డివిజన్ పరిధిలోని ఆర్ఓలు, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఆర్డీవో, ఇతర అధికారులతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గత విడతల్లో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకూండా చూసుకోవాలని పేర్కొన్నారు.