'పిడుగుపాటుకు ఆవు మృతి'
VKB: పరిగి మండలం సయ్యద్ పల్లి గ్రామంలో విషాదం నెలకొంది. రైతు తమ్మన్న చంద్రశేఖర్‌కు చెందిన ఆవు పిడుగుపాటుకు గురై మృతిచెందింది. పొలం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో సుమారు రూ.60 వేల విలువైన ఆవు మరణించడంతో రైతు కన్నీరుమున్నీరయ్యారు. రైతుకు తగిన పరిహారం అందించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.