'పశువులకు గాలికుంటు టీకాలు తప్పనిసరి'
ADB: నెరడిగొండ మండలం వాగ్దారిలో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. మండల పశు వైద్యాధికారి డాక్టర్ రాథోడ్ జీవన్ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల నుంచి పశువులను రక్షించుకోవడానికి టీకాలు వేయించడం ఉత్తమమని సూచించారు. పశు పెంపకం దారులు నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.