వన్యప్రాణులను వేటాడుతున్న వ్యక్తులు అరెస్ట్

వన్యప్రాణులను వేటాడుతున్న  వ్యక్తులు అరెస్ట్

BDK: చండ్రుగొండ మండలంలోని కరిశలబోడు తండా బీట్ పరిధిలో వన్యప్రాణులను వేటాడుతున్న ఆరుగురిని అటవీ శాఖ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. ఫారెస్ట్ రేంజర్ ఎల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు విద్యుత్ తీగలు అమర్చి జంతువులను వేటాడుతున్నట్లు అందిన సమాచారంతో సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వేటగాళ్లను పట్టుకుని కేసు నమోదు చేశారు.