VIDEO: 'నిధుల కొరత వల్ల అభివృద్ధిలో ఆలస్యం జరుగుతుంది'

RR: హయత్‌నగర్ డివిజన్‌లోని మహేశ్వరినగర్ కాలనీలో కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలోని సమస్యలతో పాటు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ వ్యవస్థలో నిధుల కొరత వల్ల అభివృద్ధి పనుల్లో ఆలస్యం జరుగుతుందని, పటిష్టమైన ప్రణాళికతో దశలవారీగా సమస్యలను పరిష్కరిస్తానన్నారు.