డబల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద నాట్లు వేసి నిరసన

NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద లబ్ధిదారులు ఆదివారం సాయంత్రం తమ ఇళ్ల ముందు నిలిచిన వర్షపు నీటిలో నాట్లు వేసి వినూత్న నిరసన తెలిపారు. కొంతకాలంగా ఇక్కడ వర్షపు నీరు భారీగా నిలిచి ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.