కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన సీపీఎంఎల్ పార్టీ

BDK: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినట్లు సీపీఐ ఎంఎల్ మాస్లైన్(ప్రజా పంథా) పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండ చరణ్ పేర్కొన్నారు. దుమ్ముగూడెంలో మండల కమిటీ సభ్యుడు వీరభద్రం అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నని గెలిపించాలన్నారు.