వేములవాడలో నేడు సైకిళ్ళ పంపిణీ

SRCL: వేములవాడ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు మోదీ కానుకగా కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ మంగళవారం సైకిళ్లు పంపిణీ చేయనున్నారని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాట్లను నాయకులు పరిశీలించారు. ఆయన వెంట రాపెల్లి శ్రీధర్, బండ మల్లేశం, మల్లికార్జున్, ఇతర నాయకులు ఉన్నారు.