నేడు జిల్లాలో పర్యటించనున్న ఎంపీ

CTR: ఎంపీ దుగ్గుమల్ల ప్రసాదరావు చిత్తూరులో సోమవారం పర్యటిస్తారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు నిర్వహించే పార్లమెంటరీ కమిటీ సమావేశానికి ఆయన హాజరు అవుతారని అందులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కార్యాలయం తెలిపింది.