'80 ద్విచక్ర వాహనాలకు జరిమానా'

'80 ద్విచక్ర వాహనాలకు జరిమానా'

ప్రకాశం: జిల్లాలో శనివారం పోలీసు అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ఏకంగా 80 ద్విచక్ర వాహనాలకు జరిమానా విధించినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. హెల్మెట్, వాహన సంబంధిత ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వంటి అంశాలలో జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. వాహనదారులు నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని పోలీసులు హెచ్చరించారు.